ఏపీలో ఉగ్రవాద కదలికలు.. పవన్ కల్యాణ్ సంచలన లేఖ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-19 14:26:23  IST  )

ఏపీలో ఉగ్రవాద కదలికలు కలకలం రేపుతున్నాయి..

ఏపీలో ఉగ్రవాద కదలికలు.. పవన్ కల్యాణ్ సంచలన లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఉగ్రవాద(Terrorism) కదలికలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌(Hyderabad)లో పేలుళ్ల(Blasts)కు ప్లాన్ చేసిన ఇద్దరిలో ఒకరిది విజయనగరం(Vizianagaram) కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇంకా ఎంత మంది ఉన్నారనే అనుమానాలు వెల్లవెతుత్తున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అప్రమత్తమయ్యారు. సీఎస్ విజయానంద్‌(Cs Vijayanand)తో పాటు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా(Dgp Harish Kumar Gupta)కు ఆయన లేఖ రాశారు. ఉగ్రవాద కదలికలపై నిరంతరం అప్రమత్తత అవసరమని తెలిపారు. తీర ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా పెట్టాలని సూచించారు.రోహింగ్యాలు, ఉగ్రవాద మద్దతు, సానుభూతిదారులు, స్లీపర్ సెల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, ఆపరేషన్ సింధూర్ పరిస్థితులను దేశం మొత్తం చూసింది. భారతీయులపై ఉగ్రవాదుల దాడిని ఖండించింది. ఉగ్రచర్యలను రాష్ట్ర ప్రభుత్వం సైతం వ్యతిరేకించింది. ఆపరేషన్ సింధూర్‌కు సంఘీభావం తెలిపింది. సైనికులకు మద్దతు తెలుపుతూ రాష్ట్రంలో అన్ని పార్టీలు తిరంగా ర్యాలీలు నిర్వహించాయి. దేశ భక్తిని చాటి చెప్పాయి. విజయవాడలో కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారత సైనికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్రవాద చర్యలను ఖండించారు. తాజాగా ఉత్తరాంధ్రలో ఉగ్రవాది అరెస్ట్‌తో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తం చేస్తూ లేఖ రాశారు.

Next Story