- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి.. జనసేన పార్టీ కీలక నిర్ణయం
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ జనసేన పార్టీ (Janasena Party) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ జనసేన పార్టీ (Janasena Party) కీలక నిర్ణయం తీసుకుంది. మృతులకు జనసేన ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir)లోని బైసన్ (Baisan)ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి (Terrorist Attack) చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Jansena President Pawan kalyan) ఈ దుశ్యర్యను ఖండించి, మృతులకు సంతాపం తెలియజేశారు.
అలాగే జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ.. మూడు రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ దిశానిర్ధేశం చేశారు. సంతాప దినాల సందర్భంగా బుధవారం అన్ని పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవతనం చేస్తూ.. సగం వరకూ దించి ఉంచాలని స్పష్టం చేశారు. అంతేగాక సాయంత్రం కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని, శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా మానవ హారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలని తెలియజేశారు. పార్టీ అధినేత పవన్ ఆదేశాలతో బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు పార్టీ జెండాను అవతనం చేసి, మృతులకు నివాళులు అర్పించారు.






