Breaking:టెన్త్ షార్ట్ మెమోలు విడుదల

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో పదో తరగతి పాసైన విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది.

Breaking:టెన్త్ షార్ట్ మెమోలు విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి పాసైన విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. పదో తరగతి పాసైన విద్యార్థుల సబ్జెక్టుల వారీగా మార్కుల లిస్టుకు సంబంధించిన షార్ట్ మెమో(Short Memo)లను ఏపీ(Andhra Pradesh) విద్యాశాఖ(Education Department) విడుదల చేసింది. ఈ మెమోల ద్వారా విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో షార్ట్ మెమోలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

వీటిని స్కూల్ లాగిన్ నుంచి పాఠశాలల(School) హెడ్ మాస్టర్స్ డౌన్‌లోడ్ చేసుకుని, సంతకం చేసి విద్యార్థుల(Students)కు అందజేయాలని సూచించారు. మెమోల్లో ఏదైనా తప్పులుంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. స్కూల్ అడ్మిషన్ రికార్డ్‌తో పాటు హెచ్‌ఎం అటెస్ట్ చేసిన షార్ట్ మెమో కాపీలను ఈ నెల(మే) 25లోగా తమకు పంపాలని విద్యాశాఖ అధికారులు కోరారు. ఏపీలో గత నెల(ఏప్రిల్) 23వ తేదీన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

Next Story