మంత్రి నారా లోకేష్ మాట తప్పారు.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత.. ఏఐఎస్‌ఎఫ్‌ నిరసన

by Ramesh Naini |

ఇచ్చిన మాట తప్పారంటూ మంత్రి నారా లోకేష్‌పై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి.

మంత్రి నారా లోకేష్ మాట తప్పారు.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత.. ఏఐఎస్‌ఎఫ్‌ నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇచ్చిన మాట తప్పారంటూ మంత్రి నారా లోకేష్‌పై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. విద్యా రంగ సమస్యల పరిష్కరం కోసం ఏఐఎస్‌ఎఫ్‌ ఛలో విజయవాడకి పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ధర్నాచౌక్ వద్ద విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు పలువురు విద్యార్థి సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు విడుదల చేయాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని, విద్యా సంస్థలోకి విద్యార్థి సంఘాలు నిషేధం ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యా రంగం నిర్లక్ష్యానికి గురవుతుందని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్‌తో జరిగిన సమావేశం అసంతపూర్తిగా ముగిసిందని.. ఏ అంశంపై కూడా స్పష్టమైన హామీ రాలేదని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Next Story