- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: శవాన్ని పూడ్చొద్దంటూ ఆందోళన.. ఉద్రిక్తత
చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పూడ్చే విషయంలో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పూడ్చే విషయంలో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని రెండు సామాజికి వర్గాల(Two social classes) మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గం రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చివరికి పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. ఈ ఘటన కర్నూలు జిల్లా(Kurnool District) మంత్రాలయం మండలం చెట్నపల్లి(Chetnapally)లో జరిగింది.
చెట్నపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందారు. అయితే ఈ రోజు ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానిక శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అయితే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గం అడ్డుకుంది. తమకు చెందిన శ్మశానంలో పూడ్చిపెట్టేందుకు వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు సామాజిక వర్గాల వాగ్వాదానికి దిగాయి. మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.
కాగా ఇదే శ్మశాన వాటిక కోసం రెండు సామాజిక వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై ఫిర్యాదు చేసినా రెవెన్యూ సిబ్బంది స్పందించకపోవడంతోనే ఉద్రిక్తత చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు.






