- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. ఉద్రిక్తత
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్(Ambedkar) విగ్రహానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా(Chittoor District)లో జరిగింది. జీడీ నెల్లూరు మండలం దేవళంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మద్దతుపలికారు. ఈ ఘటనపై సీఎంవో కార్యాలయంతో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పూతలపట్టు, నెల్లూరు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేలు సౌతం ఆరా తీశారు. స్థానిక ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి డిమాండ్ చేశారు.






