తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉద్రిక్తత.. హిందువుల అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-17 13:54:16  IST  )

తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది....

తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉద్రిక్తత.. హిందువుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలిపిరి(Alipiri)లో నిర్మాణం అవుతోన్న ముంతాజ్ హోటల్‌(Mumtaz Hotel)ను వ్యతిరేకిస్తూ హిందూ సంఘాల(Hindu communities) నేతలు, సాధువులు అఖిలాండం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ముంతాజ్ హోటల్ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో నిరసనకారుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు సాధువులు, హిందూ సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరును వ్యతిరేకించారు.


అయితే నిరసనకారులను పోలీసులు లాక్కెళ్లి వ్యాన్లలో వేశారు. ఈ ఘటనలో పలువురు సాధువులు గాయాలయ్యాయి. తమ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. మరోవైపు తిరుమలలో ధర్నా చేయడంతో సాధువులు, హిందూ సంఘాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Next Story