Breaking: శాతవాహన కాలేజీ కూల్చివేత.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-06 06:23:02  IST  )

విజయవాడలో శాతవాహన కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది...

Breaking: శాతవాహన కాలేజీ కూల్చివేత.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijaywada)లో శాతవాహన కాలేజీ(Satavahana College) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రొక్లెయిన్లతో కాలేజీ భవనాలను కూల్చివేశారు. అంతేకాదు బోయపాటి శ్రీనివాస అప్పరావు పేరుతో బోర్డులు సైతం పాతారు. కొంతకాలంగా కాలేజీ యాజమాన్యం మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కూల్చివేతలకు పూనుకున్నారు. రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా కాలేజీని బోయపాటి అప్పరావు వర్గీయులు నేలమట్టం చేశారు. కాలేజీ తమకే చెందుతుందని భవనాలను కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. కూల్చివేతలకు వినియోగించిన ప్రొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారిని బోయపాటి వర్గీయులు అడ్డుకున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కూల్చివేత శిథిలాల కింద విద్యార్థుల రికార్డులు ఉన్నాయి. దీంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా శాతవాహన కాలేజీ యాజమాన్యం మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రిన్సిపల్ కిడ్నాప్‌నకు గురయ్యారు. ఈ కాలేజీ వివాదంపై ఇప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇంతలోనే బోయపాటి అప్పారావు వర్గీయులు కాలేజీ భవనాలు కూల్చివేశారు.

Next Story