- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి(Vijayawada MLA Sujana Chowdhury) కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భవానీపురం బాధితులు(Bhawanipuram victims) ఒక్కసారిగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. 25 ఏళ్లుగా భవానీపురం వాసులు ప్రైవేటు వ్యక్తులకు సంబందించిన రెండు ఎకరాల్లో స్థలంలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. అయితే కోర్టు అనుమతితో ఈ ఇళ్లను గురువారం ఉదయం నుంచి కూల్చివేశారు. దీంతో అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి అందరి ఇళ్లను నేలమట్టం చేశారు. ఈ మేరకు బాధితులు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే లేకపోవడంతో అక్కడున్న సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమ నివాసాలను చూస్తుండగానే కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లామని చెప్పారు. కోర్టు ఆదేశాలు వచ్చే లోపే తమ గూడును కూల్చివేశారని తెలిపారు.
కాగా విజయవాడ భవానీపురంలో రెండు ఎకరాల 40 సెంట్ల స్థలం లక్ష్మీ రామ కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన స్థలంలో పేదలు నివాసముంటున్నారు. అయితే ఈ సొసైటీకి హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో భారీ బందోబస్తు మధ్య ఇళ్లను అధికారులు కూల్చివేశారు.






