Breaking: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-03 10:57:39  IST  )

మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది...

Breaking: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి(Former MLA Abbayya Chowdhury) ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత ఐదేళ్లు ఆయన దెందులూరు(Dendulur) నియోజకవర్గం ఎమ్మెల్యేగా సేవలందించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో చేపలు, రొయ్యల చెరువుల లీజు(Fish, Shrimp ponds Lease) విషయంలో రూ. 5 కోట్ల మేర అప్పలు ఉన్నట్లు కొల్లేరు వాసులు ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. కొద్ది రోజు క్రితం మానవహారంలాంటి నిరసనలు వ్యక్తం చేశారు. అయితే అబ్బయ్య చౌదరి పట్టించుకోలేదు. దీంతో తాజాగా ఆందళనను ఉధృతం చేశారు.

అబ్బయ్య చౌదరి ఇంటి ముట్టడికి యత్నం


అయితే వీరికి స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. ఈ రోజు ఉదయం రాయన్నపాలెం(Rayannapaleam)లోని అబ్బయ్య చౌదరి ఇంటిని ముట్టడించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అబ్బయ్య చౌదరి ఇంటిపై రాళ్లు రువ్వారు. అయితే ఈ సమయంలో ఆయన ఇంట్లో లేరు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. భారీగా చేరుకుని ఆందోళనకారులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు వైసీపీ నేతలు, కార్తలు కూడా భారీగా చేరుకోవడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతం ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు. కానీ టెన్షన్ వాతావరణం మాత్రం కొనసాగుతోంది. ఎటువైపు నుంచి ఆందోళనకారులు వస్తారేమోనని అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఎవరికీ బాకీ లేను

అయితే ఈ ఆందోళనలపై అబ్బయ్య చౌదరి స్పందించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. చేపల వేలం విషయంలో తాను ఎవరికీ డబ్బులు బాకీ లేదని చెప్పినట్లు తెలిపారు. అలా ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అబ్బయ్య చౌదరి తెలిపినట్లు పేర్కొన్నారు. ఇదంతా స్థానక టీడీపీ నేతలు చేస్తున్నారని, తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని అబ్బయ్య చౌదరి తెలిపారని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Next Story