విద్యార్థి సంఘాల ధర్నా.. హోరెత్తిన తిరుపతి ఆర్డీఓ కార్యాలయం

by Vemula.Srinu Prasad |

తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది....

విద్యార్థి సంఘాల ధర్నా.. హోరెత్తిన తిరుపతి ఆర్డీఓ కార్యాలయం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి ఆర్డీఓ కార్యాలయం(Tirupati RDO Office) వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాలు(Student unions) భారీ ధర్నా(Protest) నిర్వహించాయి. విద్యార్థి సంఘం నాయకులపై కేసులను నిరసించారు. తిరుపతి వైసీపీ ఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద నడిరోడ్డుపై బైఠాయించారు. దీంతో హర్షిత్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థి సంఘం నేతలు మధ్యన తోపులాట జరిగింది. ఈ మేరకు పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కొంతసమయం గడిచిన తర్వాత పోలీసుల హామీతో విద్యార్థి నేతలు ఆందోళనను విరమించారు.

Next Story