- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YCP: చలో సుదికొండ కార్యక్రమం.. ఉద్రిక్తత
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు(Former Minister Seediri Appalaju) ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.చలో సూదికొండ(Chalo Sudikonda)కు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని వెంటనే ఆగిపోవాలని సూచించారు. దీంతో పోలీసులతో వైసీపీ(Ycp) శ్రేణులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల సమక్షంలో సీదిరి అప్పలరాజు సూదికొండకు చేరుకున్నారు. పలాసకు కేంద్రీయ విద్యాలయం మంజూరు కాలేదని, ఆ పేరుతో పేదల ఇల్లు కూల్చివేస్తున్నారని ఆరోపించారు. కేంద్రీయ విద్యాలయం పేరు చెప్పి కంకర దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రీయ విద్యాలయం(Central Vidyalaya) పేరు చెబితే కంకర దోపిడీని విద్యార్థులు ప్రశ్నించరనేదే అధికార పార్టీ నేతల ప్లాన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 8 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు అయ్యాయని, కానీ పలాసకు లేదని అప్పలరాజు తెలిపారు. విద్యాలయం పేరుతో కూల్చి వేసిన పేదల ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు.






