వరిగుంటపాడులో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-04 08:31:34  IST  )

నెల్లూరు జిల్లా వరిగుంటపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

వరిగుంటపాడులో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా వరిగుంటపాడు(Variguntapadu)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్(Mining)కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఓ వ్యక్తి పోరాటం చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తిని పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లారు. దీంతో జంగారెడ్డిపల్లి గ్రామస్తులు(Jangareddypalli Villagers) ఆగ్రహం వ్యక్తం చేశారు వరిగుంటపాడులో ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. అక్రమంగా జరుగుతున్న మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తి అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అంతేకాక పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు పోలీసులకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనతో ఎస్సై రఘనాథ్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తిని వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో నిరసనను ఉధృతం చేస్తామని జంగారెడ్డిపల్లి గ్రామస్తులు హెచ్చరించారు.

Next Story