Tirupati: కనకదుర్గమ్మ గుడి కోసం గొడవ.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-06 12:55:32  IST  )

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది..

Tirupati: కనకదుర్గమ్మ గుడి కోసం గొడవ.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District) చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం(Srinivasamangapuram)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కనకదుర్గమ్మ దేవాలయం(Kanakadurgamma Temple) తమదంటే తమదంటూ సింగ్‌లు, గ్రామస్తులు గొడవ పడుతున్నారు. 1941 నుంచి కనకదుర్గమ్మ దేవాలయం నిర్వహణ బాధ్యతలను సింగ్‌లు చూస్తున్నారు. కొద్ది రోజులు క్రితం కురిసిన వర్షానికి ఆలయ ప్రహరీ కూలిపోయింది. దీంతో చందాలు వెసుకుని గ్రామస్తులు గోడ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే తామే నిర్మిస్తామంటూ గ్రామస్తులను సింగ్‌లు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. సింగ్‌లు, గ్రామాస్థుల మధ్య రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే కనకదుర్గమ్మ గుడి వద్దకు 300 మంది సింగ్‌లు వచ్చి తమను కొడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గుడిలో మందు తాగుతూ, బిర్యానీ తింటున్నారని మండిపడ్డారు. నిలదీసిన 10 మంది గ్రామస్తులపై దాడి చేశారని చెప్పారు. సింగ్‌లు ఎక్కడి నుంచో వచ్చారని, గుడి గ్రామానికి చెందినదని తెలిపారు. తమ గ్రామ తల్లి అని, తమను గుడిలోకి రానివ్వడం లేదని ఆరోపించారు. తాము గుడి దగ్గరకు వెళితే రాళ్లు, రప్పలతో కొడుతున్నారని గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. హుండీ డబ్బులు కూడా ఎత్తుకెళ్లిపోతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని మహిళలు ఆరోపించారు.

Next Story