తాడిపత్రిలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ..

తాడిపత్రిలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రి(Tadipatri)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారంటూ పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించారు.అంతేకాదు ఇంటి స్థలాన్ని కొలతలు వేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former Mla Kethireddy Pedda Reddy) ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

కాగా తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారని అధికారులు గుర్తించారు. భగత్ సింగ్ నగర్‌లో 10 సెంట్ల స్థలంలో పెద్ద భవంతిని పెద్దారెడ్డి నిర్మాణం చేశారు. అయితే ఇందులో 2 సెంట్లు ఆక్రమించారని మున్సిపల్ అధికారులు ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై పెద్దారెడ్డి స్పందించలేదు. దీంతో మున్సిపల్ అధికారులు శనివారం ఉదయం పెద్దారెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంటి స్థలాన్ని కొలతలు వేశారు. ఈ మేరకు రిపోర్టును మున్సిపల్ కమిషనర్‌కు అందజేయనున్నారు.

Next Story