- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేనలో వర్గ విభేదాలు... ఫ్లెక్సీ విషయంలో కొట్టుకున్న రెండు వర్గాలు
by Vemula.Srinu Prasad |
కృష్ణా జిల్లా కంకిపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేనలో భగ్గుమన్న విభేదాలతో పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా కంకిపాడు(Kankipadu)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన(Janasena)లో భగ్గుమన్న విభేదాలతో పార్టీ నాయకులు రెండు వర్గాలు(Two Groups)గా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. కంకిపాడులో ఆదివారం జనసేన సభ్యత్వ నమోదు(Jana Sena membership registration) కార్యక్రమం ఆ పార్టీ నేతలు నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో సునీల్, స్వాతి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఫ్లెక్సీల్లో తమ ఫొటోలు పెట్టలేదని స్వాతి వర్గం నిలదీసింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. దీంతో రెండు వర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తమ అనుమతులు లేకుండా ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Next Story






