- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: జోగి రమేశ్ ఇంటికి నిప్పు.. ఉద్రిక్తత
విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada) ఇబ్రహీంపట్నం(IbrahimPatnam)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. అంతేకాదు ఇంటికి నిప్పు పెట్టారు. అలాగే రాళ్ల దాడి సైతం చేశారు. వైసీపీ ఫ్లెక్సీలను తగులబెట్టారు. జోగి రమేశ్ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే దాడి సమయంలో జోగి రమేశ్ ఇంట్లో లేరు. ప్రస్తుతం జోగి రమేశ్ ఇంటి అంతస్తులో అగ్నికీలక ఎగిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది జోగి రమేశ్ ఇంటి వద్దకు చేరుకున్నారు... మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.
అంబటి ఇంటిపైనా ఇలానే..
ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైనా దాడి జరిగింది. ఆయన నివాసానికి సైతం నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో జరిగిన ఉద్రిక్తతలో అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఈ ఘటన మర్చిపోకముందే మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపైనా దాడి జరగడంతో వైసీపీ నేతలు, శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ దాడులను తాము అడ్డుకుంటామని చెబుతున్నారు.






