- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగింపునకు యత్నం.. భీమవరంలో ఉద్రిక్తత
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం(Bhimavaram)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ(Actor, Super Star Krishna) విగ్రహం ఏర్పాటుపై వివాదం నెలకొంది. అన్ని అనుమతులు తీసుకొని భీమవరం ఎడ్వర్ట్ ట్యాంక్ పార్క్ సమీపంలో కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే పార్క్ సుందరీకరణ కోసం మున్సిపల్ అధికారులు కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని నోటీసులు జారీ చేశారు. అంతేకాదు కృష్ణ విగ్రహం తొలగించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ విగ్రహం తొలగింపును అడ్డుకున్నారు. ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎందుకు తొలగించాలని ప్రశ్నించారు. పార్క్ అందం దెబ్బతింటుందనే వంకతో విగ్రహాన్ని తొలగించడం సరికాదని మండిపడ్డారు. కృష్ణ విగ్రహం ఏర్పాటు భావోద్వేగాలతో కూడుకున్న వ్యవహారమని, తొలగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
అలాగే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణ విగ్రహం ఏర్పాటుకు అన్ని అనుమతులు తీసుకున్నట్లు కోర్టుకు వివరించారు. అధికారులు అనుమతులు ఇచ్చి ఇప్పుడు తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో కృష్ణ విగ్రహం తొలగింపుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.






