- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో కాకాణి
నెల్లూరు జిల్లా రామాపురం మండలం కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా రామాపురం మండలం కండలేరు జలాశయం(Kandaleru Reservoir) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ(Ycp) ఆధ్వర్యంలో జలాశయాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) వెళ్లారు. ఈ నేపథ్యంలో నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కాకాణి నిరసనకు అనుమతి లేదని ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో కాకాణితో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
శనివారం సైతం నెల్లూరులో ఉద్రికత్త చోటు చేసుకుంది. సోమశిల ప్రాజెక్టు(Somashila Project)ను సందర్శించేందుకు వైసీపీ నేతలు యత్నించారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. రాయలసీమ ప్రాజెక్టుకు చంద్రబాబు చరమగీతం పాడారని, జిల్లాలోని జలాశయాలను తాము సందర్శిస్తే ప్రభుత్వం ఏం నష్టం వస్తుందని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో రాయలసీమ నుంచి సోమశిల, కండలేరుకు నీటిని తరలించి జిల్లాలోని మెట్టప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని అనుకన్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆదివారం కండలేరు సందర్శనకు యత్నించడంతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






