- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District) నక్కపల్లి(Nakkapalli)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్స్ కంపెనీ(Bulk Drugs Company) వద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించారు. బలవంతంగా భూసేకరణ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించారు. బల్క్ డ్రగ్స్ కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా బల్క్ డ్రగ్స్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 800 ఎకరాల భూములకోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గతంలోనూ 8 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. తాజాగా సైతం భూసేకరణ చేపట్టారు. దీంతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. బల్క్ డ్రగ్స్ కంపెనీల వల్ల స్థానిక ప్రాంతాలు కలుషితం అవుతాయని, ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉందని, రైతులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని స్థానికులు అంటున్నారు. భూ ఉపరితలంతో పాటు సముద్ర తీరం కూడా పాడవుతుందని స్థానికులు ధర్నా నిర్వహించారు. ప్రమాదకరమైన బల్క్ డ్రగ్స్ కంపెనీ తమకు వద్దని తేల్చి చెప్పారు.






