కల్తీ నెయ్యి కేసులో కీలక ఆధారాలు: టీటీడీ ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్

by Vemula.Srinu Prasad |

కల్తీ నెయ్యి కేసులో కీలక ఆధారాల సేకరణతో టీటీడీ ఉద్యోగుల్లో టెన్షన్ పట్టుకుంది...

కల్తీ నెయ్యి కేసులో కీలక ఆధారాలు: టీటీడీ ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: కల్తీ నెయ్యి కేసు(Adulterated ghee case)లో సిట్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) ప్రొక్యూర్‌మెంట్ జీఎం సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏ29 నిందితుడిగా ఉన్న ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన బోలె బాబా డెయిరీ నుంచి సుబ్రహ్మణ్యం ముడుపులు తీసుకున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. కల్తీ నెయ్యిని స్వచ్ఛమైన ఆవు నెయ్యిగా సరఫరా చేసేందుకు లక్షల్లో లంచంతో పాటు విలువైన బహుమతులను సైతం బోలె బాబా డెయిరీ నుంచి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. బోలేబాబా, వైష్ణవి డెయిరీలను తనిఖీ చేసినప్పుడు సైతం భారీగా నగదు, నగలు తీసుకున్నట్లు సిట్ అధికారులు ఈ విషయాన్ని సైతం సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో దాఖలు చేశారు.

మరోవైపు కల్తీ నెయ్యి సరఫరాకు మరికొంత మంది ఉద్యోగులు కూడా సహకరించినట్లు సిట్‌కు సమాచారం అందింది. దీంతో కీలక ఆధారాలను సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. మరో 11 మందిని నిందితులిగా గుర్తించారు. ఈ మేరకు మరికొంత మంది టీటీడీ ఉద్యోగులను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది. దీంతో టీటీడీ ఉద్యోగుల్లో కల్తీ నెయ్యి కేసు భయం పట్టుకుంది.

Next Story