జగన్ చిత్తూరు పర్యటనలో ఉద్రిక్తత.. కార్యకర్తకు గాయాలు

by Ajay Maddhiboyina |

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బంగారుపాళ్యంలో ఆయన మామిడి రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చారు.

జగన్ చిత్తూరు పర్యటనలో ఉద్రిక్తత.. కార్యకర్తకు గాయాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బంగారుపాళ్యంలో ఆయన మామిడి రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చారు. అయితే ఈ పర్యటనలో ఉధ్రిక్తత నెలకొంది. జగన్‌ను కలిసేందుకు భారీగా ప్రజలు అక్కడకు చేరుకున్నారు. కాగా ఓ కార్యకర్తకు గాయాలు అవ్వడంతో పోలీసులు కొట్టారని జగన్ కాన్వాయ్ నుండి దిగేందుకు యత్నించారు.

గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లి పరామర్శించాలనుకున్నారు. ఈ క్రమంలో ఆయనను ఎస్పీ అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్ దిగకుండా అడ్డుకుని ముందుకు పంపించారు. ఇదిలా ఉంటే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు ముందుగానే పోలీసులు ఆంక్ష‌ల‌తో కూడా అనుమ‌తి ఇచ్చారు. 500 మందికి మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఇవ్వ‌గా వేల మంది బంగారుపాళ్యంకు చేరుకున్నారు. దీంతో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Next Story