- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ పర్యటన.. సత్తెనపల్లిలో టెన్షన్.. టెన్షన్
సత్తెనపల్లిలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రైతులను పరామర్శించేందుకు జగన్ సత్తెనపల్లి వెళ్తున్నారు. అయితే ఈ పర్యటనకు తొలుత పోలీసులు అనుమతినిరాకరించారు. సరైన అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత జగన్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పొదిలి పర్యటనలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మహిళలు, పోలీసులపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. వైసీపీ నాయకులపై కేసులు, అరెస్ట్ కూడా జరిగాయి.
దీంతో ఈ ఘటన దృష్ట్యా సత్తెనపల్లి పోలీసులు తాజాగా మరింత అప్రమత్తమయ్యారు. సత్తెనపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలో జగన్ పర్యటించే ప్రదేశాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సత్తెనపల్లిలోకి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నగరంలోకి స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. అనుమతులు ఉంటేనే ఇతరులకు రానిస్తున్నారు. మరోవైపు జగన్‌కు భారీగా స్వాగతం పలకాలని వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. అమరావతి రైతులు, మహిళలను సాక్షి టీవీలో కించపర్చిన వ్యాఖ్యలపై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. జగన్ సతీమణి భారతి క్షమాపణ చెప్పాల్సిందేనని అమరావతి మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటిస్తున్నారు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చూడాలి ఏం జరుగుతుందో.






