- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
తిరుపతిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని అరెస్ట్ చేయాలంటూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ...

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని(Chandragiri Mla Pulivarthi Nani)ని అరెస్ట్ చేయాలంటూ వైసీపీ నేతలు(Ycp Leaders) ఆందోళనకు దిగారు. రిటైర్డ్ న్యాయవాదితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevireddy Bhaskar reddy) కుటుంబంపై పులివర్తి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎస్పీకి మెమోరాండం ఇచ్చేందుకు యత్నించారు.
లిమిట్‌గా రండి...
అయితే గుంపుగా కాకుండా కొద్దిమందితోనే కార్యాలయంలోకి రావాలని చెప్పడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం ఎదుటే బైఠాయించి ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో వైసీపీ నేతలపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన కార్యాలయంలోకి వైసీపీ నేతలు దూసుకొచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.






