Mohan Babu : మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-15 08:29:23  IST  )

సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్ బాబు(Mohan Babu) కుటుంబంలోని అంతర్గత వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి.

Mohan Babu : మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్ బాబు(Mohan Babu) కుటుంబంలోని అంతర్గత వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. దర్శక, నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు తిరుపతి (Tirupathi)లోని యూనివర్సిటీ(University) వద్ద ఉద్రిక్తత (Tension) చోటు చేసుకుంది. ఇప్పటికే యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు, మంచు విష్ణు(Manchu Vishnu)ఉన్నారు. మోహన్‌బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) కూడా ఈ రోజు యూనివర్సిటీ వద్దకు వస్తాడన్న సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

యూనివర్సిటీ గేట్లు మూసి వేసి.. పరిసర ప్రాంతాలకు ఎవరినీ అనుమతించడం లేదు. మీడియాను కూడా అక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది ఆదేశించారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) కూడా యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. భార్య మౌనికా రెడ్డితో కలిసి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో భద్రతా కట్టుదిట్టం చేశారు. మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు బయలుదేరారు.

రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్శిటీకి చేరుకోనున్న మంచు మనోజ్-భూమా మౌనిక దంపతులు..వర్సిటీ ఆవరణలో ఉన్న తాత నారాయణస్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మల సమాధులకు పూజలు చేయనున్నారు. అనంతరం నారావారి పల్లెకు చేరుకుని మంత్రి నారా లోకేష్ తో వీరు భేటీ కానున్నారు. ఆ తర్వాత రంగంపేటలో జరగనున్న జల్లికట్టు పోటీలను వీక్షించనున్నారు. దీంతో మంచు మనోజ్ టూర్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు.

Next Story