గుంటూరు జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్సీకి, పోలీసులకు వాగ్వాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-01 10:54:13  IST  )

గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అత్యవసర విభాగం వద్ద పోలీసుల వ్యవహారశైలిపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

గుంటూరు జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్సీకి, పోలీసులకు వాగ్వాదం
X

దిశ,వెబ్ డెస్క్: గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (Guntur Government Public Hospital) అత్యవసర విభాగం వద్ద పోలీసుల వ్యవహారశైలిపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(MLC Lella Appi Reddy) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చిన ఒక రోగిని పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో, అత్యవసర వార్డు ప్రధాన ద్వారాన్ని మూసివేసి పోలీసులు అడ్డుకోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి గేట్లను ప్రజలకు అందుబాటులో లేకుండా ఎలా మూసివేస్తారని అధికారులను నిలదీశారు.

ఎమ్మెల్సీకి, పోలీసు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం

ఈ క్రమంలో ఎమ్మెల్సీకి, అక్కడున్న పోలీసు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రోగులకు సేవలు అందించాల్సిన చోట ఇలాంటి ఆంక్షలు విధించడం సరికాదని ఆయన మండిపడ్డారు. అత్యవసర చికిత్స నిమిత్తం వచ్చే వారికి ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించడంపై తన నిరసన వ్యక్తం చేశారు.

జీజీహెచ్ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత

ఈ ఘటనతో గుంటూరు జీజీహెచ్ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ అనుచరులు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఆసుపత్రికి వచ్చే సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని, నిబంధనల పేరుతో రోగులను ఇబ్బంది పెట్టవద్దనినేతలు డిమాండ్ చేశారు.

కోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌.. విచారణ 6కు వాయిదా

Next Story