కోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌.. విచారణ 6కు వాయిదా

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-01 10:54:56  IST  )

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై తాజాగా రాజమండ్రి జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఇరువర్గాల వాదనలు విన్న ధర్మసనం విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది....

కోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌..  విచారణ 6కు వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ అనంతబాబు(MLC Ananthababu) బెయిల్ రద్దు పిటిషన్‌పై తాజాగా రాజమండ్రి జిల్లా కోర్టు(Rajahmundry District Court)లో వాదనలు జరిగాయి. అయితే ఇరువర్గాల వాదనలు విన్న ధర్మసనం విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పు(Supreme Court verdict)ను ఎమ్మెల్సీ అనంతబాబు ఉల్లంఘించారని ఈ మేరకు అతని బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

కాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు(Driver Subramaniam murder case)లో ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య కీలక నిందితులుగా ఉన్నారు. దీంతో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కొన్ని రిమాండ్ల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు కావడం జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ కేసుకు సంబంధించిన సాక్షులను ఎమ్మెల్యే అనంతబాబుతో పాటు ఆయన అనుచరులు బెదిరించినట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అంతేకాదు బాధితుల ఫిర్యాదుతో అనంతబాబుపై కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే సాక్షులను బెదిరించినందుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు బెయిల్‌ను రద్దు చేయాలనే డిమాండ్లు పెరిగాయి. దీంతో రాజమండ్రి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

గుంటూరు జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్సీకి, పోలీసులకు వాగ్వాదం

Next Story