- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం.. కాసేపట్లో జగన్ రాక, పోలీసుల 18 షరతులు
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే కూటమి సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఇవాళ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే కూటమి సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఇవాళ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం (Narsipatnam)లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నప్పటికీ పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలోనే జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శించనున్న నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనకు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసులను మోహరించారు.
మరోవైపు జగన్ పర్యటనకు పోలీసులు మొత్తం 18 షరతులతో అనుమతులు జారీ చేశారు. ఇక రూల్స్ అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) హెచ్చరించారు. తాము నిర్దేశించిన రూట్‌లో కాకుండా వేరే మార్గంలో వెళ్లినా, నిబంధనలను ఉల్లంఘించినట్లుగా పరిగణించాల్సి ఉంటుందని జగన్ సహా వైసీపీ నేతలను జిల్లా పోలీసులు హెచ్చరించారు. భారీగా జనసమీకరణ చేసినా, బహిరంగ సభలు నిర్వహించినా అనుమతించబోమని స్పష్టం చేశారు. జగన్ వెళ్లే మార్గంలో ఊరేగింపులు, ర్యాలీలకు పోలీసులు ఏ మాత్రం అనుమతి లేదన్నారు. ప్రజలు రోడ్ల పక్కన నిలబడి మాత్రమే తమ అభిమానాన్ని, మద్దతును చూపాలన్నారు. అలాగే జగన్ కాన్వాయ్‌లో కేవలం 10 వాహనాలను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.






