- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు.. రేపే టెండర్లు
by Naga Rani Yarlagadda |
ఏపీలో మెట్రో ప్రాజెక్టులకు (AP Metro Project) కీలక ముందడుగు పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మెట్రో ప్రాజెక్టులకు (AP Metro Project) కీలక ముందడుగు పడింది. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు రేపు అనగా.. జులై 25, శుక్రవారం టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.21,616 కోట్లతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేపట్టనుండగా.. ఇందులో విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు (Vijayawada Metro Rail Project) రూ. 10,118 కోట్లు, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 11,498 కోట్లతో టెండర్లు పిలవనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 పార్ట్నర్ షిప్ తో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టనున్నాయి. విశాఖ మెట్రో (Vizag Metro)కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద వీఎంఆర్డీఏ (VMRDA) నుంచి రూ.4,101 కోట్లు, విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ (CRDA) నుంచి రూ.3,497 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.
Next Story






