ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో "అమరావతి" అక్షర శిల్పం

by Naga Rani Yarlagadda |

తెనాలి శిల్ప కళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర రూపొందించిన "అమరావతి" అక్షర రూప శిల్పం తాజాగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అమరావతి అక్షర శిల్పం
X

దిశ, వెబ్‌డెస్క్: తెనాలి శిల్ప కళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర రూపొందించిన "అమరావతి" అక్షర రూప శిల్పం తాజాగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఇటీవల జరిగిన అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకలో ఈ శిల్పం ప్రధాన ఆకర్షణగా నిలిచి ప్రముఖులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇనుప వేస్ట్ వస్తువులతో రూపొందించిన ఈ శిల్పాన్ని బహిరంగ ప్రదర్శనలో ఉంచారు. శిల్పాన్ని రూపొందించిన అనంతరం, వారు వివిధ రికార్డుల సంస్థలకు వివరాలు పంపగా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి సర్టిఫికెట్, గోల్డ్ మెడల్ లభించాయి.

కాటూరి ఆర్ట్ గ్యాలరీ సందర్శించిన సబ్ కలెక్టర్

ఈ సందర్భంగా తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ మంగళవారం కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. శిల్పకారులకు శుభాకాంక్షలు తెలియజేసి, రికార్డు సర్టిఫికెట్ అండ్ గోల్డ్ మెడల్ ను వారికి అందించారు. ఆర్ట్ గ్యాలరీ గురించి మాట్లాడుతూ.. సంప్రదాయ శిల్ప కళను ఆధునిక 3డీ సాంకేతికతతో కలగలిపి రూపొందించిన ఈ శిల్పాలు అత్యద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. కళల పట్ల యువతలో ఆసక్తి పెంచేలా ఈ కేంద్రం ప్రేరణాత్మకంగా, కెరీర్ మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

Next Story