- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: బస్సులో 10 మంది మహిళలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
by Vemula.Srinu Prasad |
అనకాపల్లి జిల్లాలో 10 మంది మహిళలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది....

X
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లాలో 10 మంది మహిళలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. గాయాలతో బయటపడ్డారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎలమంచిలి మండలం కృష్ణాపురంలో జరిగింది. బ్రాండిక్స్ దుస్తుల కంపెనీకి చెందిన బస్సు రోజుమాదిరి మహిళలను తీసుకుని విధులకు వెళ్తోంది. అయితే మార్గమధ్యలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రేన్ సాయంతో బస్సును పైకి పక్కకు పార్క్ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలు లేచివేళ బాగుందని, లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.
Next Story






