- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Heavy Rain Effect: రాష్ట్రంలో వర్ష బీభత్సం.. పది మంది మృతి
ఏపీలో గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత కొన్ని రోజుల నుంచి వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు చెట్లు నేలకొరిగాయి. చెట్టు కొమ్మలు ఇళ్లపైన పడటంతో పలువురు గాయపడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి.
ఇదిలా ఉంటే.. నిన్న(ఆదివారం) ఏపీ(Andhra Pradesh)లోని తిరుపతి, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో పది మంది మృతి చెందారు. ఈ క్రమంలో తిరుపతి-4, బాపట్ల-2, ప్రకాశం-2, ఏలూరు-1, నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటుకు 8మంది మరణించినట్లు సమాచారం. చెట్లుకూలి ఒకరు, విద్యుత్‌ఘాతంలో మరోకరు మృతి చెందారు. ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల సమయాల్లో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. పిడుగుల పడే సమయాల్లో ప్రజల సెల్ ఫోన్‌లకు సందేశం వెళ్లని సమయంలో దగ్గరగా ఉన్నట్లైతే నేరుగా వెళ్లి అప్రమత్తం చేయాలని సూచించారు. పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లాల్లో పరిస్థితులను బట్టి కిందిస్థాయి అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. మరో నాలుగైదు రోజులు ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.






