గుంటూరులో భారీ అగ్నిప్రమాదం.. పది కార్లు దగ్ధం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-24 14:13:59  IST  )

అగ్నిప్రమాదంలో పది కారు దగ్ధమైన ఘటన గుంటూరులో జరిగింది...

గుంటూరులో భారీ అగ్నిప్రమాదం.. పది కార్లు దగ్ధం
X

దిశ, వెబ్ డెస్క్: అగ్నిప్రమాదం(Fire Accident)లో పది కార్లు దగ్ధమైన ఘటన గుంటూరు(Guntur)లో జరిగింది. స్థానిక ఆటో నగర్‌(Auto Nagar)లో ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్(Transformer) పేలింది. దీంతో మంటలు భారీగా వ్యాపించాయి. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌కు సమీపంలో ఉన్న కార్లకు మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. అయితే అప్పటికే పది కార్లు దగ్గమయ్యాయి. స్థానికంగా ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story