గుడివాడలో ఆలయ కమిటీ అపచారం.. వెంకటేశ్వర స్వామి బంగారు కిరీటం తాకట్టు

by Vemula.Srinu Prasad |

గుడివాడ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మోసం వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన బంగారు కిరిటాన్ని ఆలయ కమిటీ సభ్యులు సొంత అవసరాలకు తాకట్టు పెట్టి భారీగా డబ్బులు తీసుకున్నారు. ..

గుడివాడలో ఆలయ కమిటీ అపచారం..  వెంకటేశ్వర స్వామి బంగారు కిరీటం తాకట్టు
X

దిశ, వెబ్ డెస్క్: గుడివాడ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో(Gudiwada Kalyana Venkateswaraswamy Temple) మోసం వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన బంగారు కిరిటాన్ని(Golden Crown) ఆలయ కమిటీ సభ్యులు సొంత అవసరాలకు తాకట్టు పెట్టి భారీగా డబ్బులు తీసుకున్నారు. దాతలు నిలదీయడంతో రూ. 70 లక్షల విలువ చేసే కిరీటాన్ని రూ.38 లక్షలకు తాకట్టు పెట్టినట్లు చెప్పారు. మాటూరు సుబ్బారావు అనే దాత.. స్వామివారికి 2025లో కిరీటాన్ని విరాళంగా గుడికి సమర్పించారు. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆలయ కమిటీ తాకట్టు పెట్టింది. దీంతో దాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

దాత సుబ్బారావు తీవ్ర ఆవేదన

అయితే ఈ ఘటనపై దాత సుబ్బారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందరి చూస్తుండగానే స్వామివారికి కిరీటం బహూకరించామని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో స్వామివారికి కిరిటాన్ని అలంకరించకపోవడంతో అనుమానం వచ్చిందన్నారు. ఆరా తీయడంతో బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు తమకు తెలిసిందని చెప్పారు. వెంటనే తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తే కోర్టుకు వెళ్లమని చెప్పారని సుబ్బారావు స్పష్టం చేశారు. ఆ కిరిటాన్ని తమకు అప్పగించాలని, మంచి కమిటీ ఉన్న ఆలయంలో సమర్పిస్తాని ఆయన పేర్కొన్నారు.

Next Story