- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండుతున్న ఎండలు.. ఏపీ @ 48.14
రాష్ట్రంలో ఎండలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వేసవి తీవ్రతతో రాష్ట్రం నిప్పుల గుండంగా మారింది. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండలు(Scorching Heat) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వేసవి తీవ్రత(Summer Intensity)తో రాష్ట్రం నిప్పుల గుండంగా మారింది. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవడంతో పలు జిల్లాల్లో రికార్డు స్థాయి వేడి నమోదవుతోంది.
తాండవిస్తున్న వడగాల్పులు: పిడుగురాళ్లలో గరిష్ట ఉష్ణోగ్రత
రాష్ట్రంలోనే అత్యధికంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల(Piduguralla)లో ఉష్ణోగ్రత ఏకంగా 48.14 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, కృష్ణా జిల్లా నందివాడల్లో 47.17 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి.
అల్లాడుతున్న జనం.. హెచ్చరిస్తున్న అధికారులు
ఈ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పలు ఇతర జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






