- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాడేరులో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలోని పలు మండలాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జి.మాడుగులలో 4.5 డిగ్రీల సెల్సియస్, మినుములూరులో 5.5 డిగ్రీలు, పాడేరులో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అరకు వ్యాలీ, చింతపల్లి, హుకుంపేట వంటి ఇతర ప్రాంతాల్లోనూ 4 నుంచి 7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను చలి గజగజలాడిస్తోంది. ఉత్తర గాలులు, దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం వేళల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఈ చలి తీవ్రత పర్యాటకులను ఆకర్షిస్తూ అరకు, వంజంగి, లంబసింగి వంటి ప్రాంతాల్లో సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. ఈ చలి డిసెంబర్ చివరి వరకు కొనసాగవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.






