సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు.. ర్యాంకులివే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-06 10:51:01  IST  )

UPSC సివిల్స్ పరీక్షల్లో తెలుగు వాళ్లు సత్తా సాటించారు. ఏపీ, తెలంగాణ నుంచి మంచి సివిల్స్ రాసిన 17 మంది మంచి ర్యాంకులు సాధించారు..

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు.. ర్యాంకులివే..!
X

దిశ, వెబ్ డెస్క్: UPSC సివిల్స్ పరీక్షల్లో(UPSC Civil Services exams) తెలుగు వాళ్లు(Telugu people) సత్తా సాటించారు. ఏపీ(Ap), తెలంగాణ(Telangana) నుంచి మంచి సివిల్స్ రాసిన 17 మంది మంచి ర్యాంకులు సాధించారు. గూడెల్లి సృజనకు 55వ ర్యాంకు రాగా డీఎస్‌కే ప్రచేత్‌కు 193వ ర్యాంకు, ఎస్‌.వర్షిత్‌రెడ్డికి 259వ ర్యాంకు, ఎం.పవన్‌కుమార్‌రెడ్డికి 297వ ర్యాంకు, వెలిమినేటి విక్రమసింహారెడ్డికి 541వ ర్యాంకు, గుమ్మల శ్వేతకు 573వ ర్యాంకు, పల్లి ప్రమోద్ విష్ణుకు 640వ ర్యాంకు, వెలిమినేటి విజయసింహారెడ్డికి 682వ ర్యాంకు, పోతుపురెడ్డి భార్గవ్‌కు 738వ ర్యాంకు, పుడారి రాహుల్‌కు 748వ ర్యాంకు, కుమ్మరి శ్రవణ్‌కుమార్‌కు 768వ ర్యాంకు, కత్తిమాని అనిరుధ్‌కు 786వ ర్యాంకు, కోరపోతుల శ్రీకర్‌రాజుకు 806వ ర్యాంకు, ఇస్లావత్‌ శ్రీరామ్‌ హర్షకు 823వ ర్యాంకు, కట్టా ప్రత్యూషకు 908వ ర్యాంకు, గోగుల రాజశేఖర్‌కు 920వ ర్యాంకు, గుగులోతు జితేందర్ నాయక్‌కు 939వ ర్యాంకు సాధించారు. దీంతో వీరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తోటి స్నేహితులు, బంధవులు విషెస్ చెబుతున్నారు.

కాగా అఖిల భారత సర్వీసుల్లో మొత్తం 1087 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ ఉద్యోగాల భర్తీకి Upsc సివిల్స్ పరీక్ష నిర్వహించింది. తాజాగా ఈ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 958 మందిని ఎంపిక చేసింది. టాప్ 100లో తెలుగమ్మాయి సృజన 55వ ర్యాంకు సాధించారు.

Next Story