మరో మున్సిపాలిటీపై కన్ను.. టీడీపీలో చేరిన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-17 08:06:17  IST  )

మరో మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ నాయకుల కన్ను పడింది....

మరో మున్సిపాలిటీపై కన్ను.. టీడీపీలో చేరిన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు
X

దిశ, వెబ్ డెస్క్: మరో మున్సిపాలిటీపై తెలుగుదేశం(Telugu Desam Party) పార్టీ నాయకుల కన్ను పడింది. గత ఎన్నికల్లో పోటీ చేయని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండటంతో ఒక్కో పీఠాన్ని దక్కించుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకూ చాలా మున్సిపాలిటీల్లో వైసీపీని దించి టీడీపీ(Tdp) జెండాను ఎగరవేశారు. ఇప్పుడు శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ(Kadiri Municipality)ని చేజిక్కించుకునేందుకు వ్యూహాలు అమలు చేశారు. దీంతో 13 మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరారు. ఈ మేరకు కదిరి మున్సిపాలిటీలో టీడీపీ సంఖ్యాబలం పెరిగింది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మొత్తం 25 మంది కౌన్సిలర్లు నిలిచారు. వైసీపీ చైర్మన్, వైస్ కౌన్సిలర్‌పై అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. ఈ 19న ఓటింగ్ జరగనుంది. దీంతో కదిరి మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. కచ్చితంగా ఈ పీఠాన్ని టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందని రాజకీయ శ్రేణులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story