Ap New: టీడీపీ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-07 10:57:55  IST  )

కొత్త చేరికల విషయంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది..

Ap New:  టీడీపీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: కొత్త చేరికల విషయంలో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లుగాని, లేదా కొత్తగా వచ్చే వాళ్ల కోసం కొత్త నిబంధనలను రూపొందించారు. నిర్దేశిత పద్ధతుల ద్వారా ఇకపై తెలుగుదేశంలో చేరికలుంటాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Tdp State Chief Palla Srinivasarao) తెలిపారు. ఎవరైనా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ముందుగా మంగళగిరి (Mangalagiri) పార్టీ కార్యాలయంలో కచ్చితంగా తెలియజేయాలని చెప్పారు. వారి వివరాలను సమగ్రంగా పరిశీలన, విచారణ జరిపిన తర్వాతనే పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నియమ నిబంధనలకు అనుగుణంగానే ప్రతి చేరిక ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిలో ఏ హోదాలో ఉన్న వాళ్లనా సరే తు.చ. తప్పటించకుండా పాటించాలని పల్లా శ్రీనివాసరావు చెప్పారు.

కాగా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ఇప్పుడు మరింత బలాన్ని పుంచుకుంది. విజయవంతంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏడాది పాలన గడిచింది. దీంతో పార్టీలో చేరేందుకు చాలా మంది నేతలు సముఖుత చూపుతున్నారు. మరో నాలుగేళ్ల అధికారంలోకి ఉంటుందనే దీమాలో మూకుమ్మడిగా కూటమి పార్టీల్లో చేరేందుకు నాయకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నేతలు, నాయకులను గతంలో మాదిరిగా వెంటనే పార్టీ చేర్చుకోకుండా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే తెలుగుదేశంలో చేర్చుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Next Story