- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : ప్రపంచంతో తెలంగాణ పోటీ..సీఎం రేవంత్ పట్టుదల : బోరెడ్డి
తెలంగాణ(Telangana) రాష్ట్రం దేశంలోని సాటి రాష్ట్రాల(States Of The Country)తో కాకుండా ప్రపంచంతో పోటీ పడటమే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పట్టుదల అని సీఎం చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) రాష్ట్రం దేశంలోని సాటి రాష్ట్రాల(States Of The Country)తో కాకుండా ప్రపంచంతో పోటీ పడటమే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పట్టుదల అని సీఎం చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఒక నాయకుని సానుకూల దృక్పధం..రాష్ట్రం మరోస్థాయికి పయనించాలనే ఆశయం..ప్రపంచంతో పోటీ పడాలనే పట్టుదలకు మూసీకి పునరుజ్జీవం ఒక నిదర్శనమన్నారు.
ఒక ఆర్ఆర్ఆర్(RRR) సమాంతరంగా రీజినల్ రైల్వే(Regional Railway), మరో అద్భుత నగరంగా ఫోర్త్ సిటీ(Fourth City)లు సీఎం రేవంత్ రెడ్డి పట్టుదల, ఆశయానికి నిదర్శనమన్నారు. పుట్టినగడ్డ బలం తెలిసిన నాయకుడు..ఒడిసిపట్టి, గురిపెట్టే వీరుడు సీఎం రేవంత్ రెడ్డి అని బోరెడ్డి కొనియాడారు. దావోస్ లో రాష్ట్రానికి 1లక్ష 78,950కోట్ల పెట్టుబడులు సీఎం రేవంత్ రెడ్డితో సాధ్యమని బోరెడ్డి స్పష్టం చేశారు.






