- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ టీడీపీ నేతల కొంపముంచిన AI.. చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పడంతో...
AI సాయంతో తెలంగాణ టీడీపీ నేతలకు ఘరానా మోసం జరిగింది..

దిశ, వెబ్ డెస్క్: ‘అన్ని అయిపోయాయి... ఈ సారి వెరైటీగా ఉండాలి. అది కూడా అందరూ చెప్పుకోవాలి. ఒకే పార్టీకి చెందిన వాళ్లను బురిడీ కొట్టించాలి. వాళ్ల వాళ్ల పేరు చెప్పాలి. బురిడీ కొట్టించి డబ్బులు కొట్టాయాలి’’ అని ఓ వ్యక్తి వేసిన ఐడియా పారినట్టే పారి చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన రాష్ట్రంలోనే పేరు గాంచిన ఏలూరులో జరిగింది. ఏలూరుకు చెందిన భార్గవ్.. డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం కొంచెం తెలివితేటలు ఉపయోగించారు. ఏఐ టెక్నాలజీని వినియోగించారు. ఇతరులు అయితే డౌట్ వస్తుందని అనుకున్నారు. అది ఒకే పార్టీలోనే అయితే చేసిన మోసం బయటకు రాదు అని అనుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీనియర్ నేత దేవినేని ఉమ పేర్లను యదేచ్ఛగా వాడేశారు. ఇందులో AI సాయం తీసుకున్నారు. దీని ద్వారా చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి తెలంగాణ టీడీపీ నేతలకు టోకరా వేశారు.
సెప్టెంబర్ 30న సత్తుపల్లి(Sattupally)కి చెందిన ఓ వ్యక్తి టీడీపీ(Tdp) నేతలకు వీడియో కాల్ చేశారు. తాను దేవినేని ఉమా(Devineni Uma) పీఏని అంటూ నమ్మించారు. నగదు ఫోన్ పే చేయాలని సూచించారు. ఈ నెల 7న దేవినేని ఉమా పేరుతోనే మరోసారి వీడియో కాల్ చేశారు. సీఎం చంద్రబాబు వీడియో కాల్ మాట్లాడుతారని చెప్పి, చంద్రబాబు(Chandrababu)ను పోలిన వ్యక్తితో వీడియో కాల్ చేయించారు. నిజమేనని నమ్మి టీడీపీ నేతలు రూ.35 వేలు పంపారు. స్థానిక సంస్థల్లో టికెట్ పేరుతో మొత్తం 18 మంది నేతలకు టోకరా వేశారు. తీరా మోసం అని తెలియడంతో పోలీసులకు ఖమ్మం జిల్లా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.






