ఏపీ ఈఏపీసెట్‌లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు

by Vemula.Srinu Prasad |

ఏపీ ఈఏపీసెట్‌లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు..

ఏపీ ఈఏపీసెట్‌లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఈఏపీసెట్‌(AP EAPSET)లో తెలంగాణ విద్యార్థులు(Telangana Students) మెరిశారు. ఇంజనీరింగ్(Engineering), అగ్రి, ఫార్మసీ(Agri, Pharmacy) విభాగంలోనూ హైదరాబాద్‌(Hyderabad)తో పాటు తెలంగాణకు చెందిన జిల్లాలకు చెందిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో అయితే హైదరాబాద్ జిల్లా వనస్థలిపురానికి చెందిన విద్యార్థి అనిరుథ్ రెడ్డి ఏకంగా తొలి ర్యాంకు సాధించారు. అగ్రి, ఫార్మసీ విభాగంలోనూ ఇద్దరు తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన నిశాంత్‌ రెండో ర్యాంకు, హనుమకొండకు చెందిన విద్యార్థి షణ్ముఖ్‌ నాలుగో ర్యాంకు సాధించారు. దీంతో విద్యార్థుల కుటుంబాల్లో ఆనందం వెల్లివెరిసింది. పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. బాగా కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నారు.

Next Story