- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి సుప్రభాత సేవలో తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్..
by Indraja |
కలియుగ దైవంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

X
దిశ తిరుమల: కలియుగ దైవంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కాగా తిరుమల చేరుకున్న ఎమ్మెల్యేకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. తిరుమలలో శనివారం వేకువజామున జరిగిన స్వామివారి సుప్రభాత సేవలో తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయ రంగనాయక మండపంలో శ్రీనివాస్ యాదవ్‌కు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Next Story






