- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు కవిత
ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ రిలీఫ్ దొరకడంతో తిరుమలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బయల్దేరారు..

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi LIquor Case)లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Telangana Jagruti President Kavitha)కు క్లీన్ చిట్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆమెకు బిగ్ రిలీఫ్ దొరకడంతో తిరుమల శ్రీవారి(Tirumala Srivari)ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకున్న ఆమె అలిపిరి నుంచి నడకమార్గంలో తిరుమల కొండపైకి నడకమార్గంలో బయల్దేరారు. ప్రస్తుతం ఆమె కొండపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. నడకమార్గంలో కవితను చూసిన భక్తులు ఆమెతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ అనే ప్రాంతీయ లేకుండా, రాజకీయాలకు అతీతంగా కవితను స్వాగతిస్తున్నారు. ఎలా ఉన్నారు.. బాగున్నారా అంటూ పలకరిస్తున్నారు. ఆంధ్రలో తనపై ఉన్న ప్రేమతో కవిత ఉబ్బి తబ్బి పోతున్నారు.
అయితే అలిపిరి వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో లిక్కర్ కేసులో చేయని తప్పునకు నాలుగేళ్లుగా మానసిక వేదన అనుభవించానని తెలిపారు. దేవుడి దయ వల్ల కేసును కోర్టు పూర్తిగా కొట్టేసిందని పేర్కొన్నారు. కేసు నుంచి విముక్తి లభిస్తే కాలి నడకన తిరుమలకు వస్తానని మొక్కుకున్నానని, అందుకోసమే తిరుపతి వచ్చానని తెలిపారు. కాలినడక తిరుమల కొండకు చేరుకుని శ్రీవారి దర్శించుకుంటానని కవిత పేర్కొన్నారు.






