జనసేన ఎమ్మెల్యే కూతురు నిశ్చితార్థానికి TG డిప్యూటీ సీఎం భట్టి.. ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్

by Gantepaka Srikanth |

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు.

జనసేన ఎమ్మెల్యే కూతురు నిశ్చితార్థానికి TG డిప్యూటీ సీఎం భట్టి.. ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఇవాళ విశాఖ వేదికగా జరిగే జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ(Konathala Ramakrishna) కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు భట్టి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న భట్టికి జనసేన పార్టీ నాయకులు స్వాగతం పలికారు. నిశ్చితార్థంతో పాటు అనకాపల్లి, విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో భట్టి పాల్గొననున్నారు. సాయంత్రం ఓట్ చోరీపై కాంగ్రెస్ నిర్వహించే ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. కాగా, ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణ మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రెండుసార్లు ఎంపీగా మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. జనసేన నుంచి ఆయన 2024 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు.

Next Story