చంద్రబాబు, జగన్‌ బానిసలు: టీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సెన్షేషనల్ వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఏపీకు బీజేపీ తండ్రి అని చంద్రబాబు, జగన్ కుమారులని టీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, జగన్‌ బానిసలు: టీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సెన్షేషనల్ వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janatha Party) తండ్రి అని చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్(Ys Jagan) కుమారులని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ పాలిటిక్స్ కల్లుదుకాణం దగ్గర కూర్చునే అన్నదమ్ముల్లా ఉంటుందని ఎద్దేవా చేశారు. బీజేపీ కల్లు దుకాణం అయితే చంద్రబాబు, జగన్ అన్నదమ్ములని తెలిపారు. రాష్ట్ర విభజనకు లెటర్లు ఇచ్చింది చంద్రబాబు, జగన్ అని చెప్పారు. కాంగ్రెస్ లో అందరూ దమ్మున్నోళ్ళమేనని, కోమటిరెడ్డి సోదరులు సైతం దమ్మున్న వాళ్ళేనన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ బానిసలని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రజలారా.. ఓట్ల చోరీ విషయంలో ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story