వందేభారత్ రైలులో సాంకేతిక లోపం.. అత్యవసరంగా నిలిపివేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-13 08:41:07  IST  )

వందేభారత్ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది...

వందేభారత్ రైలులో సాంకేతిక లోపం.. అత్యవసరంగా నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: వందేభారత్(Vande Bharat) రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా నెల్లూరు రైల్వే స్టేషన్‌(Nellore Railway Station)లో రైలును నిలిపివేశారు. హైదరాబాద్(Hyderabad) నుంచి తిరుపతి(Tirupati) వెళ్తుండగా ఘటన జరిగింది. ఈ మేరకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు బోగీల్లో ఏసీలు, ఫ్యాన్లు పని చేయకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. రైలు(Train) అరగంటకు పైగా నెల్లూరులో నిలిచిపోయింది. ప్రస్తుతం రైలులో సమస్యను గుర్తించామని, మరమ్మతులు జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. మరమ్మతుల అనంతరం రైలు యథావిధిగా తిరుపతి వెళ్తుందని స్పష్టం చేశారు. అప్పటి వరకూ ప్రయాణికులు సహకరించాలని సూచించారు.

కాగా ఇదే రూట్‌లో వందే భారత్ రైలుపై ఇటీవలకాలంలో కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన మర్చికపోముందే రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రైళ్ల ఫిట్ నెస్ విషయంలో రైల్వే అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని పలువురు అంటున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు.

Next Story