తిరుమల శ్రీవారి సేవలో టీమ్ ఇండియా క్రికెటర్లు

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-30 09:47:39  IST  )

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

తిరుమల శ్రీవారి సేవలో టీమ్ ఇండియా క్రికెటర్లు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) ఉదయం శ్రీవారిని టీమ్‌ఇండియా క్రికెటర్లు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, వికెట్‌ కీపర్‌ జితేష్ శర్మ, టీమిండియా మహిళా క్రికెటర్‌ శ్రేయంక పాటిల్ దర్శించున్నారు. వీరికి అంతకుముందు టీటీడీ(TTD) అధికారులు ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. టీటీడీ సభ్యులు దగ్గరుండి క్రికెటర్లకు వీఐపీ దర్శనాలు చేయించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు క్రికెటర్లకు వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు అక్కడున్న భక్తులు ఎగబడ్డారు.

Next Story