- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లితండ్రుల తర్వాతి స్థానం గురువులదే.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
పాఠశాలలు దేవాలయాలు.. మన పిల్లల్లి తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్యక్షేత్రాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పాఠశాలలు దేవాలయాలు.. మన పిల్లల్లి తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్యక్షేత్రాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విద్యార్థుల విషయంలో టీచర్లదే కాదు.. తల్లిదండ్రులది కూడా బాధ్యత ఉంటుందన్నారు. ప్రభుత్వ బడుల్లో బాగా చదువు చెప్పరని ఒక అపోహ ఉందని అన్నారు. మీ పిల్లలను ఎక్కడ చవివించుకున్నా నాకు అభ్యంతరం లేదు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. మెగా పేరెంట్స్మీటింగ్తో గిన్నిస్‌రికార్డు నెలకొల్పామన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనివ్వండి..
విద్యార్థుల హాజరును తల్లిదండ్రులు తెలుసుకునేందుకు కొత్తగా యాప్ తెచ్చామని.. పిల్లలు స్కూలు డుమ్మా కొడితే వెంటనే తెలిసిపోతుందని అన్నారు. పిల్లలకు మంచి యూనీఫాం ఇచ్చాం.. మంచి పుస్తకాలు ఇచ్చామని తెలిపారు. కొత్తచెరువుకు వస్తే మళ్లీ చదువుకోవాలని పిస్తుందన్నారు. పిల్లలకు ఇచ్చే పుస్తకాలు, బ్యాగులపై కూడా గత పాలకులు బొమ్మలు వేసుకున్నారని విమర్శించారు. నేను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం ఇక్కడ వచ్చిందన్నారు. పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని 1998లో అనుకున్నానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పైకొచ్చిన వారు ఆ స్కూళ్లకు ఎంతో కొంత చేయూత నివ్వాలని కోరారు. విద్యావ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి లోకేశ్‌కు అభినందనలు తెలిపారు. గడచిన ఐదేళ్లలో ఒక టీచర్‌ను కూడా నియమించలేదన్నారు. టీచర్లు లేకుండా విద్యా సంస్కరణలు ఎలా తెచ్చారో జగన్ చెప్పాలన్నారు. ఆంగ్ల మాధ్యమం పెట్టామంటూ లేనిపోని సమస్యలు తీసుకొచ్చారని ఆరోపించారు. టీచర్లను తాము గౌరవంగా చూస్తాం.. కొత్త సంస్కరణలను తీసుకు వస్తామని అన్నారు. ఇప్పటికే 12 డీఎస్సీలు పెట్టి లక్షా 66 వేల మందికి టీచర్ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇటీవలే ఇంకో డీఎస్సీ వేసి 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నామని ప్రకటించారు.






