- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Teachers: రేపే ఉపాధ్యాయ బదిలీల షెడ్యూలు !
\విద్యాశాఖతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలం అయ్యాయి

ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలం
పలు డిమాండ్లకు అంగీకరించిన విద్యాశాఖ
ఎస్జీటీలకు మాన్యువల్ బదిలీలు
టీచర్ల ఉద్యమ కార్యాచరణ తాత్కాలిక వాయిదా
దిశ, డైనమిక్ బ్యూరో : విద్యాశాఖతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఉపాధ్యాయ సంఘాలు (Teachers Union) ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో బదిలీలకు మార్గం సుగమం అయింది. రేపు ఉపాధ్యాయ బదిలీల (Transfers) షెడ్యూలు విడుదల కావచ్చని సంఘాల నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో ఉపాధ్యాయుల సమస్యలు, బదిలీలకు సంబంధించి ఈ రోజు ఉన్నతాధికారులతో సంఘాల నాయకులు చర్చలు జరిపారు. ఇందులో పలు డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వివరాలను వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు జరగబోయే బదిలలీలు ఎస్జీటీలకు మ్యాన్యువల్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. ఉన్నత పాఠశాలల్లో 49 దాటిన తరువాత 2 వసెక్షన్ ఏర్పాటు చేస్తారు. ఫౌండేషన్ పాఠశాలల్లో 20 రోల్ దాటిన తరువాత 2వ పోస్టు ఇస్తారు. ఉన్నతపాఠశాలల్లో నిర్వహించే ప్రాధమిక పాఠశాలలు విడిగా నిర్వహిస్తారు.
వర్క్ లోడ్ ఎక్కువయ్యే సందర్భంలో వర్క్ లోడ్ ఉన్న సబ్జెక్టులకు అవసరంమేరకు అకడమిక్ ఇన్ స్ట్రక్టర్/ సర్ప్లస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు. స్టడీ లీవ్ లో ఉన్న ఉపాధ్యాయులు ఆగస్టు 2025 లోపు చేరే వారి స్థానాలను బదిలీలలో ఖాళీగా చూపరు. ప్రస్తుత బదిలీలలో బ్లాకింగ్ ఉండదు. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 1382 పి.ఎస్.హెచ్.ఎం పదోన్నతులు కల్పిస్తారు. రెండు సార్లు రీ అపోర్షన్మెంట్ కి గురయ్యే ఉపాధ్యాయులకు 7 పాయింట్లు ఇస్తారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారానికి జూన్ నెలలో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. బదిలీల అనంతరం ఎంఈఓ, ప్రధానోపాధ్యాయుల పరస్పర బదిలీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే సమాంతర మాధ్యమం విషయం విద్యాశాఖ మంత్రితో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపినట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో తమ ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.






